స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.శాకుంతలం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కొత్త ప్రాజెక్ట్ లతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు తానేంటో ప్రూవ్ చేసుకుంటానని సమంత నమ్ముతున్నారు.
లగ్జరీ డూప్లెక్స్ అపార్టుమెంట్( Luxury duplex apartment ) ను సమంత కొనుగోలు చేయడం గమనార్హం.తన స్నేహితురాలి ద్వారా సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాలో( financial district area ) సమంత ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం.జయభేరి కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో సమంత ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఈ ఇల్లు ఖరీదు ఏకంగా 7.8 కోట్ల రూపాయలు అని సమాచారం.సమంత నికర ఆస్తుల విలువ 89 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.సమంత ప్రస్తుతం ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
ఖుషి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా ఈ ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సాంగ్ ఉంది.సిటాడెల్ ఇండియన్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది.మరోవైపు ఈ మధ్య కాలంలో సమంత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఖుషి సినిమా పునర్జన్మల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
పవన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖుషి మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.మైత్రీ బ్యానర్ పై శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.