మామూలుగా స్టార్ హీరోలకు, హీరోయిన్స్ కి మాత్రమే అభిమానులు ఉంటారు.అభిమాన సంఘాలు కూడా ఉంటాయి.
ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా అభిమాన సంఘం ఉండకూడదని ఎక్కడ రూల్ లేదు కదా.అయితే సినిమా మొదటి జనరేషన్ హీరోల విషయానికొస్తే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లకు పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు ఉండేవి.వారి తరంలోనే నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పాపులర్ అయిన రక్త కన్నీరు నాగభూషణం( Nagabhushanam ) సైతం ఫాన్ ఫాలోయింగ్ విషయంలో చాలా దీటుగా ఉండేవాడు.అప్పట్లో ఆయన అనేక పాత్రల్లో నటించాడు.
నెగటివ్ పాత్రల విషయంలో మాత్రం నాగభూషణం తర్వాతే ఎవరైనా అంటూ ఉండేవారు.

అలా ఆయనకు కూడా హీరోలకు సమానంగా అభిమాన సంఘాలను ఏర్పరచుకున్నారు.ఇక నాగభూషణంతో పాటు రావు గోపాల్ రావు కూడా అప్పట్లో అభిమానులను ఎక్కువగా మెయింటైన్ చేయడానికి ఇష్టపడేవారు. నాగభూషణం హీరోలతో పాటు రావు గోపాలరావు( Rao Gopal Rao ) తో కూడా అభిమాన సంఘాల విషయంలో చాలా పోటాపోటీగా ఉండేవారు.
మిగతా వారి కంటే తనకు ఎక్కువగా అభిమానులు ఉండాలని కోరుకునేవారు.దానికోసం అతడికి వచ్చే రెమ్యూనరేషన్ లో ఎక్కువ భాగం అభిమానులను మెయింటైన్ చేయడానికి వారిని సంతృప్తి పరచడానికి ఉపయోగించేవారు.
తిరిగి అభిమానుల నుంచి ఆయన కోరుకునేది కేవలం మర్యాదలు, గౌరవం దక్కాలని మాత్రమే.

ఇక ఒక సందర్భంలో విజయవాడకు నాగభూషణం గారు వచ్చారట.దాంతో అక్కడ ఆయనకు ఉన్న అభిమానులు అందరూ కూడా అంబారీ కట్టి ఆయనను విజయవాడ అంత ఊరేగించారట.దాదాపు రైల్వే స్టేషన్ నుంచి దుర్గా కళ్యాణ మందిరం వరకు కూడా ఆయనను అంబారితో పూలపై నడిపించి తీసుకెళ్లారట.
దానికోసం నాగభూషణం అప్పటి అతని అభిమానులకు విందులు ఎక్కువగా ఇచ్చేవారట, వినోదాలు కూడా బాగా చూసేవారట.దాంతో ఆయన పుట్టినరోజు వస్తే అభిమానులు బాగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అన్నదానాలు, వస్త్ర దానాలు వంటివి చేసేవారట.
మొదట్లో రావు గోపాలరావు కూడా చేసిన ఆ తర్వాత కాలంలో కాస్త నెమ్మదించారు.కానీ నాగభూషణం మాత్రం వెనక్కి తగ్గలేదు.ఆయన విగ్రహాలు కూడా గుంటూరు, తెనాలి వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంటాయి.తద్వారా నాగభూషణం కొన్ని రోజుల తర్వాత ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందట.







