మధ్యప్రదేశల్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఖర్గోన్ జిల్లాలో అదుపుతప్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోరాడ్ నది వంతెనపై నుంచి పడిపోయింది.
డన్ సగా, డో దొంగర్ గావ్ మధ్య ఉదయం జరిగిన ఈ ఘటనలో 22 మంది మృతిచెందారు.పలువురు తీవ్రంగా గాయపడగా.
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
శ్రీఖండి నుంచి ఇండోర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.సమాచారం తెలుసుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.అనంతరం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.







