గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్ వాడాలని సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్ – ఐడియా సర్వీసును నిలిపివేయనున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే వొడాఫోన్ – ఐడియా నంబర్లను రిలయన్స్ జియోకు మార్చుతున్నట్లు వెల్లడించింది.కాగా ఉద్యోగులకు రూ.37.50 కే జియో పోస్ట్ పెయిడ్ అందిస్తుంది.







