యంగ్ హీరో రానా( Rana ) కరోనా సమయంలో ప్రేమించిన ప్రియురాలు మిహిక బజాజ్ ని ( Miheeka Bajaj ) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా కనిపించడంతో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమంలో సందడి చేస్తూ ఫొటోస్ తో అలరిస్తూ ఉంటారు.
ఇటీవల రానా భార్య ఒక బీచ్ ఫోటో ని షేర్ చేసింది, ఆ ఫోటోలో మిహిక కాస్త బరువు పెరిగినట్లుగా కనిపించింది.దాంతో అందరూ కూడా ఆమె ప్రెగ్నెంట్( Pregnant ) అంటూ ప్రచారం చేయడం జరిగింది.
అంతే కాకుండా ఆమె గర్భవతి అని, రామా నాయుడు జన్మించబోతున్నాడు అంటూ తెగ కామెంట్ చేశారు.ఆ సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీ సన్నిహితులు ఆమె గర్భవతి కాదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయినా కూడా సోషల్ మీడియా లో ఒక వర్గం వారు తెగ హడావుడి చేస్తూ ఆమె కి సంబంధించిన ఫోటో లను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.తాజాగా రానా కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు.ఆ కారణం తో కూడా ఆమె గర్భవతి అయి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గర్భవతి అయితే ఆమె కు తోడుగా ఉండాలని ఉద్దేశం తో రానా కొత్త సినిమాలు ఏమీ కామెంట్ అవ్వట్లేదు అని.అందుకే ఆయన ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

కానీ అది కూడా వాస్తవం కాదని తేలి పోయింది.ప్రస్తుతం రానా కొత్త కథలు వినే పనిలో ఉన్నాడు.అతి త్వరలోనే ఒక సినిమా కు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కనుక రానా తండ్రి కాబోతున్న వార్త అవాస్తవం అంతే కాకుండా.మిహిక బజాజ్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది.
తాను గర్భవతిని కాదు అంటూ తేల్చి చెప్పడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.రామా నాయుడు మృతి చెందిన తర్వాత ఆయన వారసుడిగా రానా కొడుకు వస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దగ్గుబాటి కొత్త వారసుడు వచ్చేది ఎప్పుడు అనేది చూడాలి.







