పొదుపు చేయడంలో, అలాగే పాత వస్తువులను అద్భుతంగా వాడేయడంలో ఇండియన్ మామ్స్( Indian Moms ) తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు.ఇంట్లో దేనిని కూడా వదలకుండా భారతీయ తల్లులు తమ క్రియేటివ్ ఆలోచనలతో వాటిని దేనికో ఒకదానికి ఉపయోగిస్తుంటారు.
కాగా తాజాగా తల్లులు పాత కంటెయినర్లను తిరిగి ఎలా వాడుతున్నారో, అదనపు వస్తువులతో కొత్త వస్తువులను ఎలా సృష్టిస్తున్నారో చూపించే వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ @awaraajayy ఈ వీడియోని రూపొందించాడు.తల్లులు ( Mothers ) ప్రతి వస్తువును ఎలా తమకు అనుగుణంగా మార్చుకుంటారో ఈ యువకుడు ఫన్నీ వేలో చెప్పి అందర్నీ ఆకట్టుకున్నాడు.భారతీయ ఇళ్లలో రీయూజ్, రీసైక్లింగ్‌కు సంబంధించిన విషయాలను ఈ యువకుడు తెలిపాడు.
ఈ వీడియోలో భారతీయ గృహిణులు పాత కంటెయినర్లను విసిరేయడానికి బదులుగా వాటిని ఎలా ఉపయోగిస్తారు అనేదానికి ఉదాహరణలు ఇచ్చాడు.పాత బట్టల నుంచి చాపలు, రగ్గులు వంటి అదనపు వస్తువుల నుంచి కొత్త వస్తువులను కూడా తల్లులు సృష్టిస్తారని ఈ యువకుడు చెబుతూ ఆశ్చర్యపరిచాడు.

ప్రస్తుతం వాతావరణ సంక్షోభం పెనుముప్పులా మారుతోంది.ఈ నేపథ్యంలో సస్టైనబిలిటీ, జీరో వేస్ట్, రీసైక్లింగ్ హ్యాక్స్ వంటి పదాలకు పాపులారిటీ పెరుగుతోంది.వీటికి అనుగుణంగా ఈ వీడియో నిలుస్తోంది.భారతీయ గృహిణులు ఉపయోగించే వినూత్న పద్ధతులపై నెటిజన్లు వావ్ అని కామెంట్లు చేశారు.‘అది నిజంగా అద్భుతం! నేను ఎగతాళి చేసేవాడిని కానీ ఇప్పుడు నేను నిజంగా అభినందిస్తున్నా.తల్లులకు అత్యుత్తమ రీసైక్లింగ్ టెక్నిక్ తెలుసని ఒప్పుకోవాల్సిందే!” అని మరికొందరు కామెంట్లు పెట్టారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







