ఈ రోజుల్లో జీ మెయిల్( Gmail ) ఉపయోగించని వారు అంటూ ఎవరు ఉండరు.స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది.
ఇప్పటివరకు జీ మెయిల్ పై గూగుల్ ఎటువంటి చార్జీలు వేయకుండా ఉచిత సేవలు అందించింది.కానీ త్వరలో ఉచిత సేవలకు బ్రేక్ పడనుంది.
త్వరలో జీ మెయిల్ ఉపయోగించాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.అంటే యూట్యూబ్ బాటలోనే జీ మెయిల్ కూడా పయనించబోతోంది.

యూట్యూబ్ ( YouTube ) గురించి అందరికీ తెలిసిందే.యూట్యూబ్ లో ప్రకటనలు చూడకూడదు అనుకుంటే నెలవారి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందే.లేదంటే మధ్యలో ప్రకటనలు వచ్చి ఇబ్బంది కలిగిస్తాయి.ప్రస్తుతం జీ మెయిల్ లో కూడా ప్రకటనలు వస్తూ ఉండడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే అచ్చం యూట్యూబ్ లాగానే జీమెయిల్ లో కూడా ప్రకటనలు రాకుండా నెలవారి సబ్ స్క్రిప్షన్ ప్లాన్( Subscription plan ) తీసుకోవాల్సి ఉంటుంది.త్వరలో ఈ విధానం జీమెయిల్ లో అమలు చేసేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది.
జీమెయిల్ లో వచ్చే ప్రకటనలతో లాభాలు పొందేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది.

జీ మెయిల్ వినియోగదారులు మధ్యలో ప్రకటనలు రావడం వల్ల ఇబ్బందులు పడుతూ, దీనిపై గూగుల్ కు ఫిర్యాదు చేశారు.మెయిల్ ను నావిగేట్ చేసే సమయంలో ప్రకటనల వల్ల ఇబ్బందులు పడుతున్నామని గూగుల్ కు తెలిపారు.గతంలో అయితే జీమెయిల్ లో ప్రకటనలు పై భాగంలో ఉండేవి.
కానీ ఇప్పుడు మెయిల్ మధ్యలో ప్రకటన రావడం తో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనిపై గూగుల్ స్పందిస్తూ.
సబ్ స్క్రిప్షన్ తీసుకున్న జీమెయిల్ వినియోగదారులకు ట్విట్టర్( Twitter ) తరహాలోనే బ్లూ టిక్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది.మెయిల్ పంపిన వారి పేరు ప్రక్కన బ్లూ టిక్ ను త్వరలోనే చూడవచ్చని గూగుల్ తెలిపింది.
అంతేకాకుండా యూజర్ల గుర్తింపును ద్రువీకరించడానికి, ఆన్ లైన్ స్కామ్ లను తగ్గించడానికి ఈ సబ్ స్క్రిప్షన్ ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.







