కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.ఈ క్రమంలో దాదాపు 20 రోజులపాటు బీజేపీ, కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి.
రెండో సారి అధికారం కోసం బీజేపీ ప్రచారం చేసింది.అటు కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.
కాగా కర్ణాటకలో ఎల్లుండి 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.అయితే మొత్తం నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
ఈనెల 13వ తేదీన కేంద్ర ఎన్నికల కమీషన్ ఓట్ల లెక్కింపు చేపట్టనుంది.







