సంసారంలో చిన్నపాటి గొడవలు జరగడం సహజం.భార్యాభర్తలిద్దరూ సర్దుకు పోతేనే సంసారం సాగిగా సాగుతుంది.
లేదంటే కుటుంబం నాశనం అయ్యి రోడ్డున పడుతుంది.ఈ మధ్యకాలంలో అనుమానం కారణంగా భార్యాభర్తలు దారుణాలకు పాల్పడుతున్నారు.
భర్త పరాయి మహిళతో మాట్లాడిన.భార్య పరాయి వ్యక్తితో మాట్లాడిన అనుమానం మొదలవుతుంది.
అసలు నిజాలు తెలుసుకోకుండా వివాహేతర సంబంధం ఉందనే అనుమానం కలుగుతుంది.ఈ అనుమానం క్రమంగా పెరిగి చివరికి కిరాతకంగా హత్యకు దారితీస్తుంది.
ఇలాంటి కోవకు చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.వివరాల్లోకెళితే.
తెలంగాణలోని ఆసిఫాబాద్( Asifabad ) జిల్లాలోని వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన వడాయి మారుతికి 2015లో సంగీతతో వివాహం జరిగింది.వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం.
దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే సంగీత( Sangeeta ) కు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానం మారుతికి కలగడంతో మద్యానికి బానిస అయ్యాడు.ప్రతిరోజు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.శనివారం కూడా పీకలదాకా మద్యం సేవించి, భార్యపై గొడవకు దిగాడు.
ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది.

మద్యం మత్తులో ఉన్న మారుతి క్షణికావేశంలో సంగీత తలపై గొడ్డలితో దాడి చేశాడు.ఆ సమయంలో పక్కనే ఉన్న మురళి మొర్లే పోచ్చు అనే వ్యక్తి ఇంటి లోపలికి వచ్చి గొడవ ఆపే ప్రయత్నం చేశాడు.అతనిపై కూడా మురళి గొడ్డలితో దాడి చేశాడు.
సంగీత రక్తపు మడుగులోకి జారి ప్రాణాలు విడిచింది.ఆ వ్యక్తికి మాత్రం మెడ పై, ఎడమ చేతిపై తీవ్రంగా గాయాలయ్యాయి.
చుట్టుపక్కల ఉండే స్థానికులంతా వచ్చి ఆ వ్యక్తిని హాస్పటల్ కు తరలించారు.ప్రస్తుతం అతను పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.ఈ విషయం మృతురాలి తండ్రి లెండిగురె బాబాజీ కు తెలియడంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు( Police ) మారుతిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.