కన్నడ బ్యూటీ రష్మిక మందన్న( Rashmika Mandanna ) నేషనల్ క్రష్ అయినప్పటికీ కూడా బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.ఒక స్టార్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈమెను చాలామంది టార్గెట్ చేస్తూ బాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
ఎందుకో తెలియదు ఈమె గురించి ఏదైనా వార్త వస్తే చాలు ఖచ్చితంగా ఈమెపై ట్రోల్ చేయటం మొదలు పెడతారు.

అయితే తాజాగా మరోసారి ఆమెను టార్గెట్ చేసి ఆమె ఫోటోతో మరో ఫోటోని పోల్చి బాగా ట్రోల్ చేశారు.ఈ బ్యూటీ కన్నడ కి చెందిన అమ్మాయి అయినా కూడా అక్కడ కంటే ఎక్కువగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది.
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్( Bollywood, Kollywood ) లో కూడా బాగా అవకాశాలు అందుకుంటూ మంచి సక్సెస్ లు అందుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ప్రతిరోజు తనకు సంబంధించిన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.ఇక తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను కూడా షేర్ చేసుకుంటుంది.కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ట్రిప్స్ అంటూ విదేశాలలో తిరుగుతూ ఉంటుంది.అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ బాగా హంగామా చేస్తూ ఉంటుంది.కెమెరా దృష్టి తనపై ఉందని గమనించి కెమెరా ముందే అతిగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
డాన్స్ చేయటం, ఇతరులతో అతిగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటుంది.అందుకే ఈమెను కొందరు జనాలు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.
కానీ రష్మిక అవేవీ అస్సలు పట్టించుకోదు.

ఎందుకంటే ఆమె ఒక హోదాలో ఉందన్న ధీమాతో ప్రవర్తిస్తూ ఉంటుంది.ఎవరు ఏమనుకున్నా కూడా తన హోదా ఎక్కడికి పోదు అన్న ధైర్యం తనలో ఎక్కువగా ఉంటుంది.ఇక ఇప్పటికీ ఈమెపై బాగా ట్రోల్స్ అయితే ఎదురవుతూనే ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె కొన్ని ఫోటోషూట్ చేయించుకుంది.అందులో తను కొరియన్ లుక్ లో( Korean look ) కనిపించి రకరకాలుగా స్టిల్స్ ఇచ్చింది.
ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.అయితే అందులో తన లుక్ బాగున్నప్పటికీ కూడా తన స్టిల్స్ అందర్నీ కాస్త నవ్వించినట్లు అనిపించాయి.
అయితే అందులో ఒక స్టీల్ ను ట్రోలర్స్ ట్రోల్ చేసినట్లు కనిపించారు.అందులో తను రెండు కాళ్లు చాపుకొని.
రెండు చేతులు కింద పెట్టుకొని.ఫేస్ కెమెరా వైపు చూపిస్తూ కనిపించింది.
ఇక వెంటనే ట్రోలర్స్ తన ఫోటోతో తనలాగే కూర్చున్న దయ్యం ఫోటోతో ఎడిట్ చేసి వైరల్ చేశారు.ఇక ఆ ఫోటో చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు.
అచ్చం అలాగే కూర్చుంది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







