తాజాగా ముంబై- చెన్నై( Mumbai-Chennai ) మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన( Rohit Sena ) చిత్తుగా ఓడింది.పవర్ఫుల్ బౌలింగ్ తో చెన్నై జట్టు బౌలర్లు.
ముంబై జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు.ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ డక్ ఔట్ గా పెవిలియన్ చేరాడు.
ఇక ఈ మ్యాచ్ గెలుపుతో ఆరో విక్టరీ చెన్నై ఖాతాలో పడింది.మొదట టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
ముంబై జట్టులో నెహల్ వదేరా( Nehal Vadera ) 51 బంతులలో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ తో 64 పరుగులు చేశాడు.మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేకపోయారు.తరువాత లక్ష్య చేధనకు దిగిన చెన్నై జట్టు 17.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
13 ఏళ్లుగా చెపాక్ లో ముంబై పై గెలవలేని చెన్నై తాజాగా ఈ మ్యాచ్ తో బ్రేక్ చేసింది.మ్యాచ్ ఆరంభం నుంచి చెన్నై జట్టు అద్భుత ఆటను ప్రదర్శించింది.మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు బ్యాటర్లు గ్రీన్ 6, ఇషాన్ 7, రోహిత్ 0 పరుగులతో పెవిలియన్ చేరారు.మూడు ఓవర్లు ముగిసే సరికి ముంబై 16/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
తర్వాత సూర్య కుమార్ యాదవ్ (26) నిలకడగా ఆడిన భారీ షాట్లు కొట్టలేకపోయారు.ఇక వదెరా కూడా 51 బంతుల్లో 64 పరుగులు చేసిన భారీ షాట్లు మాత్రం పడలేదు.
లక్ష్య చేధనకు దిగిన చెన్నై జట్టు ఫస్ట్ వికెట్ కు 46 పరుగులు జోడించింది.రెండవ వికెట్ కు 84 పరుగులు జోడించింది.17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి సూపర్ విక్టరీని ఖాతాలో వేసుకుంది.ఇక రోహిత్ శర్మ ఐపీఎల్లో అత్యధికంగా 16 సార్లు డకౌట్ అయిన బ్యాటర్ గా నిలిచాడు.దినేష్ కార్తీక్, మందీప్ సింగ్, నారాయణలు 15 డక్ ఔట్లతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.