బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పెద్ద నోట్లు రద్దు చేసి ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు.
ఒక్క అదానీ ఖాతాలో మాత్రమే డబ్బులు వేశారని ఆరోపించారు.పేదలకు అండగా ఉండే కేసీఆర్ కావాలా లేక లక్షల కోట్లు ఎగ్గొట్టిన దొంగల రుణాలు మాఫీ చేసిన మోదీ కావాలా అని ఆలోచించాలన్నారు.
అటు కర్ణాటకలో ఐదేళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదని విమర్శించారు.ఎన్నికలు వస్తేనే బీజేపీకి దేవుడు గుర్తుకు వస్తాడని పేర్కొన్నారు.
మామూలు రోజుల్లో దేవుడ్ని కూడా మోసం చేస్తారని ఎద్దేవా చేశారు.దిక్కు మాలిన వాళ్లకు ఓట్లు వేస్తే మళ్లీ నెత్తురు కారే తెలంగాణగా మారుతుందని వెల్లడించారు.







