మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పంతం నెగ్గించుకున్నారని తెలుస్తోంది.వివాదాస్పదంగా మారిన ఒంగోలు డీఎస్పీ నియామకం నిలుపుదల అయింది.
ఈ మేరకు డీఎస్పీ అశోకవర్ధన రెడ్డిని దర్శికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఒంగోలు డీఎస్పీ నియామకం విషయంలో బాలినేని అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశమై చర్చించారని సమాచారం.తాజాగా డీఎస్పీల బదిలీలో భాగంగా ఒంగోలు డీఎస్పీ నియామకం నిలుపుదల కావడంతో బాలినేని పంతం నెగ్గించుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.







