టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి కారుమూరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
రైతుల పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని తెలిపారు.రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
చంద్రబాబు రైతుల పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు.అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతో చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారని విమర్శించారు.







