దోమలు( Mosquito ) సమస్య అంతటా వుంది.అక్కడ, ఇక్కడ లేదు అనే సందేహమే లేదు.
మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుందని సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి.ఇక రాత్రైతే చాలు, అది కాళరాత్రిలాగా మారుతుంది ఈ దోమలతో.
ఇపుడు వాటికి కాలంతో పనిలేదు.అన్ని కాలాల్లోనూ దోమలు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి.
ఈ క్రమంలో చాలామంది కాయిల్స్, అల్ అవుట్ వంటి పరికరాలు వాడుతున్నా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి.వాటికి కూడా అవి అలవాటు పడిపోయాయి.

ఈ క్రమంలోనే మస్కిటో కిల్లర్ మెషిన్( Mosquito mission Killer ) అనేది మార్కెట్లోకి వచ్చింది.ఇది దోమలు, పురుగుల్ని ఆకర్శించి మరీ చంపుతుందని సదరు కంపెనీ వారు చెబుతున్నారు.ఇందులో పర్పుల్ కలర్‌లో ఓ లైట్ వెలుగుతూ ఉంటుంది.అది కాంతి తరంగాల్ని పంపించడం వలన ఆ కాంతికి దోమలు అక్కడికి వెళతాయి.అలా తన దగ్గరకు వచ్చే దోమల్ని తనలోపలికి లాగేసుకుంటుందన్నమాట.ఇందులో పడిన దోమలు, ఈగలు ఇతర పురుగుల్ని తేలిగ్గా తొలగించవచ్చని తెలిపారు.

కాగా దీనిని ఛార్జింగ్ కూడా చెయ్యవచ్చు. ఛార్జర్( Charger ), పవర్ బ్యాంక్, ల్యాప్ టాప్ వంటి వాటి ద్వారా ఛార్జ్ ఎక్కించుకోవచ్చు.దీనితో USB కేబుల్ కూడా వస్తుంది.ఇపుడు ఈ మెషిన్‌ని వాడుకోవడం చాలా తేలిక.దీన్ని ఇళ్లు, ట్రిప్స్‌లో కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు.అయితే దీన్ని ఆరు బయటివైపు మాత్రం వాడొద్దని కంపెనీ తన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో పేర్కొంది.

ఇది 11.5 సెంటీమీటర్ల పొడవు, 11.5 సెంటీమీటర్ల వెడల్పు, 26 సెంటమీటర్ల ఎత్తు ఉంటుందని వివరించారు.దీని అసలు ధర రూ.1,899 ఉండగా.జియోమార్ట్ లో 65 శాతం తగ్గింపుతో రూ.647కి విక్రయిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.







