మెక్‌డొనాల్డ్( Mc Donalds ) పేరు తెలియనివారు దాదాపుగా వుండరు. బర్గర్లకు( Burgers ) పెట్టింది పేరైన మెక్‌డొనాల్డ్ అంటే ముఖ్యంగా యువతకి చాలా క్రేజ్.
స్నేహితులతో అలా సరదాగా సాయంత్రం వేళ, మెక్‌డొనాల్డ్ వెళ్లడం చాలామందికి బాగా అలవాటైన ప్రక్రియ.ఈ క్రమంలో ఇక్కడి బర్గర్లంటే ఎంతోమంది లొట్టలేసుకుంటూ తింటూ వుంటారు.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా మెక్‌డొనాల్డ్ కు మంచి డిమాండ్, పేరు వున్నది.అయితే ఈమధ్య కాలంలో దానిపైన కస్టమర్లనుండి కొన్ని బాడ్ రిమార్క్స్ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా లండన్లో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన చీజ్ బర్గర్లో ఎలుక ( Rat ) అవశేషాలు రావటంతో షాక్ అయ్యాడు.ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకున్న బర్గర్లో ఎలుక వ్యర్ధాలు ఉండడం చూసి సదరు కష్టమర్ ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.దాంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టిన అధికారులు అక్కడి బాగోతం చూసి మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కు రూ 4.89 కోట్లకు పైగా జరిమానా విధించారు.

అవును, అక్కడి పరిస్ధితులను చూసి అధికారులకు దిమ్మతిరిగిపోయింది.దారుణంగా వాంతి వచ్చేంత గబ్బు పట్టిపోయి ఉన్న ఆ అవుట్ లెట్ ను చూసి వారు మొదట షాక్ అయ్యారు.అవుట్‌లెట్‌లో పారిశుద్ధ్య పరిస్ధితులు సజావుగా లేవని, ఆహారం తయారు చేసి, భద్రపరిచే ప్రదేశం సహా రెస్టారెంట్ అంతటా ఎలుకలు, ఎలుకల వ్యర్ధాలు పడివుండడం చూసి అధికారులు కోపంతో ఊగిపోయారు.ఇంకేముంది కట్ చేస్తే, పారిశుద్ధ పరిస్ధితులను ఉల్లంఘించినందుకు మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కు రూ.4.89 కోట్లకు పైగా కోట్ల జరిమానా చెల్లించాలని, 10రోజుల పాటు మూసివేయాలని స్ధానిక కోర్టు ఆదేశించారు.







