తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) స్పీడ్ పెంచుతోంది.సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో, పార్టీ నేతలంతా చురుగ్గా ఉండే విధంగా చూసుకుంటుంది.
వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కమిటీలతో ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు.
అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టే విధంగా, గ్రూపు రాజకీయాలు సర్దుమనిగేలా పార్టీ నేతలు అంతా యాక్టివ్ అయ్యేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం( Telangana ) అందిస్తున్న సంక్షేమ పథకాలు, గతంతో పోలిస్తే ఇప్పుడు చోటు చేసుకున్న అభివృద్ధి వంటి విషయాలపై జనాల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళే విధంగా, ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పి కొట్టే విధంగా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సూచించింది.

గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, ప్రతి ఓటరుని పలకరించే విధంగా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వారికి మరింతగా అవగాహన కల్పించాలని పార్టీ అధిష్టానం నుంచి కింది స్థాయి కేడర్ కు ఆదేశాలు వెల్లాయట.గ్రామ, వార్డు , మండల , డివిజన్ నియోజకవర్గం, జిల్లా కమిటీలలో యాక్టివ్ గా ఉన్న వారిని గుర్తించి సోషల్ మీడియా కమిటీని ఇప్పటికే నియమించింది.ఇక వారికి పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ( Party programmes, welfare schemes )జనాలకు వివరించే తీరును , ఇప్పటి వరకు చోటు చేసుకున్న అభివృద్ధి వంటి అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించి , వారు వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తోంది.దీనిలో భాగంగానే నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కమిటీలతో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టే విధంగా ప్లాన్ చేస్తోంది.
ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో ఎవరు ఏం పోస్ట్ పెట్టాలి ? దానిని ఏ విధంగా జనాల్లోకి తీసుకువెళ్లాలనే విషయాలను వివరించనున్నారు.

అలాగే ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకోవాలని, నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు చేయని పనులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన పనులను పోల్చుతూ పోస్టులు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు.గ్రామాల్లో ఒక వార్డులో రెండు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, నిత్యం బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను వారికి వివరించే విధంగా ప్లాన్ చేశారు .ప్రతిరోజు రాష్ట్ర కమిటీ మానిటరింగ్ తో పాటు, ఏ పోస్టు ఏవిధంగా పెట్టాలి ? దేనిని విస్తృతంగా ప్రచారం చేయాలనే విషయాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయబోతున్నారట .మొత్తంగా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుని బిఆర్ఎస్ కు మరింత ఆదరణ పెంచే విధంగా అధినేత కేసిఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు.







