జబర్దస్త్ షో ( Jabardasth ) ద్వారా పాపులర్ అయిన రాకేశ్ సుజాత పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.అయితే రాకేశ్ సుజాత పెళ్లి జరగడం వెనుక కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయనే సంగతి చాలామందికి తెలియదు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజాత( Sujatha ) మాట్లాడుతూ రాకింగ్ రాకేశ్( Rakesh ) చిన్న పిల్లోడు అని అన్నారు.మేము పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాత చాలామంది నాతో రాకేశ్ కోపిష్టి అని చెప్పారని సుజాత తెలిపారు.
అంత కోపంగా ఉండే వ్యక్తి ఓకేనా నీకు అని అన్నారని సుజాత వెల్లడించారు.రాకేశ్ కూడా నాతో అదే విషయం చెప్పి నువ్వు హ్యాండిల్ చేయగలవా అని అన్నారని సుజాత చెప్పుకొచ్చారు.
అయితే రాకేశ్ కోప్పడతాడని నాకు ఎప్పుడూ అనిపించలేదని ఆమె చెప్పుకొచ్చారు.రాకేశ్ పై నాకు ఉన్నది అంత ఇష్టమో అంత ప్రేమో తెలియదని సుజాత పేర్కొన్నారు.ఆయన కోపాన్ని కోపంలా నేను తీసుకోలేదని ఆమె తెలిపారు.

తన వర్క్ ను నేను దగ్గరినుంచి చూస్తానని సుజాత అన్నారు.మా ఇద్దరినీ దూరం చేయాలని మా మ్యారేజ్ జరగకుండా చెడగొట్టాలని అనుకుని చాలా ప్రయత్నాలు చేశారని ఆమె తెలిపారు.ఎవరితో గొడవ జరిగినా నేను వాళ్లతో మాట్లడతానని ఆమె చెప్పుకొచ్చారు.
మా గురించి నెగిటివ్ చెప్పిన వాళ్లు ఉన్నారని అలా చేసిన వాళ్లందరికీ నేను షార్ప్ ఆన్సర్ ఇచ్చేదానినని సుజాత వెల్లడించారు.

మీరు నాకు ఏం చెప్పొద్దు అని నేను బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయని ఆమె అన్నారు.నేను ఏంటి అనేది తనకు తెలియదా? అని సుజాత ప్రయత్నించారు.సుజాత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాకేశ్ సుజాత ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.








