కాంగ్రెస్ కర్ణాటక మేనిఫెస్టోపై తెలంగాణలో నిరసనలు ! మ్యాటర్ ఏంటంటే ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల( Karnataka Election ) పోలింగ్ ఈనెల 10వ తేదీన జరగబోతోంది.ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బిజెపిలు పోటా పోటీగా ప్రయత్నిస్తున్నాయి.

 Protests In Telangana Against Congress Karnataka Manifesto , Karnataka Congress-TeluguStop.com

ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇస్తున్నాయి.కొన్ని ప్రధాన సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలను అన్ని పార్టీలు ప్రకటించాయి.

ఇక్కడ గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో ఎప్పుడు లేని విధంగా బిజెపి సైతం ఉచిత పథకాలను ఎక్కువగా ప్రకటిస్తూ  వస్తోంది.ఇక కాంగ్రెస్,  బిజెపి, జెడిఎస్ తోపాటు గాలి జనార్దన్ రెడ్డి పార్టీ ఎన్నికల్లో పోటీలో ఉండడంతో ఇక్కడ పోరు రసూత్రంగా మారింది.

Telugu Karnataka Bjp, Karnataka, Telangana Bjp-Politics

 ఇది ఇలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో పై పెద్ద వివాదమే జరుగుతుంది.కర్ణాటకలో కాంగ్రెస్( Congress party ) అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్( Bajrang Dal ) ను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో,  దీనిపై తెలంగాణలో బిజెపి నిరసనలు చేపట్టింది.తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా నిజామాబాద్ బిజెపి కార్యాలయం వద్ద కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై బిజెపి నిరసన ర్యాలీ చేపట్టగా,  పోలీసులు దానిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు బిజెపి నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.రోడ్డుపైనే బిజెపి నాయకులు బైఠాయించి హనుమాన్ చాలీసా ను చదవారు.

Telugu Karnataka Bjp, Karnataka, Telangana Bjp-Politics

 ఇదేవిధంగా బిజెపి నిరసనలు చేపట్టింది .హైదరాబాదులో గాంధీభవన్( Gandhi bhavan ) ను ముట్టడించాలని బిజెపి పిలుపునివ్వడంతో బిజెపి శ్రేణులు భారీగా అక్కడకు చేరుకునే అవకాశం ఉండడంతో,  పోలీసులు అంతే  స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు.కర్ణాటకలో బిజెపి,  కాంగ్రెస్ పోటీపడుతుండగా,  ఆ ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu Karnataka Bjp, Karnataka, Telangana Bjp-Politics

ఇప్పటికే తెలంగాణ బిజెపి కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చారు.కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలోనూ కనిపించబోతుండడంతో,  ఈ రెండు ప్రధాన పార్టీలు అలెర్ట్ అయ్యాయి .అందుకే కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో ను వ్యతిరేకిస్తూ  తెలంగాణలో నిరసనలు చేపడుతూ, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube