విజయ్ దేవరకొండ 'ఖుషి' ఫస్ట్ సింగిల్ కు సమయం వచ్చేసింది!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి’. విజయ్( Vijay Devarakonda, ) కు ఈ సినిమా హిట్ చాలా కీలకంగా మారింది.

 Vijay Devarakonda Samantha Khushi First Single Details, Vijay Devarakonda, Khush-TeluguStop.com

లైగర్ వంటి ప్లాప్ చూసిన విజయ్ ఈ సినిమా ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకోవాలని తహతహ లాడుతున్నారు.

ఈ క్రమంలోనే శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్తను అందించారు మేకర్స్.

ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు తెలిపారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అన్ని అప్డేట్ లకు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.తాజాగా ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ చేసారు.ఫస్ట్ సింగిల్( Khushi First Single ) ఎప్పుడు రాబోతుందో అనే విషయం ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు.

శివ నిర్వాణ( Shiva Nirvana ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా మరో నిన్ను కోరి, మజిలీ సినిమాల సరసన నిలిచి పోతుందో లేదో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండగా.

మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube