అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఏపీలో వర్షాల అనంతరం ఏర్పడిన పరిస్థితులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదన్న మాట రాకూడదని చెప్పారు.
ప్రతి రైతుకు పరిహారం అందించాలన్న సీఎం జగన్ రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు.ఈ క్రమంలో రైతుల ఇబ్బందులపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
అదేవిధంగా రబీ సీజన్ కు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.







