మాతృత్వం దేవుడు ప్రసాదించే ఒక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు.అయితే గర్భవతి( Pregnancy ) అయినప్పుడు వైద్య ఖర్చులు పెను భారంగా మారుతాయి.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు గర్భం ధరించిన సమయంలో ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది.దీనిని గమనించిన ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది.
అదే ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY)( Pradhan Mantri Matru Vandana Yojana ) పథకం.ఇది భారతదేశంలోని గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు వరంగా మారింది.
గర్భధారణ సమయంలో వీరి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ కార్యక్రమం గర్భధారణ, ప్రసవానంతర సమయంలో వైద్య చికిత్స, ఔషధ ఖర్చులకు సంబంధించిన ఆర్థిక భారాన్ని( Financial assistance ) తగ్గించుకోవడానికి అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ఈ పథకానికి అర్హత పొందాలంటే, గర్భవతులు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి.వారికి ఒక బ్యాంకు ఖాతా ఉండాలి.ఈ పథకం రోజువారీ కూలీలు లేదా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న మహిళలకి లబ్ధి చేకూరుస్తుంది.అయితే, ఈ పథకం ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే మహిళలకు వర్తించదు.
అలానే, మొదటి బిడ్డకు జన్మనిచ్చే లేదా అప్పుడే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనాలు లభిస్తాయి.

గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ఈ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న మహిళలు రూ.1,000 నగదును అందుకుంటారు.గర్భం దాల్చిన ఆరవ నెలలో కనీసం ఒక యాంటెనాటల్ చెకప్ తర్వాత అదనంగా రూ.2,000 పొందుతారు.బిడ్డ పుట్టినప్పుడు నమోదు చేసిన తర్వాత మూడవ, చివరి వాయిదాగా రూ.2,000 అందుకుంటారు.







