“ఠాణా దివస్”( Thana Divas ) కార్యక్రమంలో భాగంగా తేదీ 04-05-2023 గురువారం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉంటానాని, ఎల్లారెడ్డిపేట్ పరిధి( Yellareddypet )లోని గ్రామాల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో ఉన్న సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.ఎల్లారెడ్డిపేట్ మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.







