కార్తికేయ 2 తో నేషనల్ లెవల్ లో సంచలనం సృష్టించిన నిఖిల్ 18 పేజెస్( 18 pages ) సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ స్పై అంటూ సరికొత్త సినిమాతో రాబోతున్నాడు.
టాలీవుడ్ లో స్పై థ్రిల్లర్ సినిమాలకు ఒక క్రేజ్ ఉంటుంది.అడివి శేష్ గూఢచారి సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు దానికి సెకండ్ పార్ట్ కూడా చేస్తున్నాడు.స్పై సినిమా అడివి శేష్ సినిమాలను మించి ఉంటుందని అంటున్నారు.
నిఖిల్ స్పై( Spy ) సినిమా సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంటున్నా సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావట్లేదు.

స్పై సినిమా కాబట్టి ఆ మాత్రం సీక్రెసీ కావాలని అనుకుంటున్నారో ఏమో కానీ ఈమధ్య ఏజెంట్ అంటూ అఖిల్( Akhil ) స్పై సినిమా ఒకటి చేశాడు.అది చూసైనా సరే నిఖిల్ తన సినిమా అలా కాకుండా తగిన జగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని అంటున్నారు.నిఖిల్ స్పై సినిమాను గ్యారీ బి.హెచ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇప్పటికే ఎడిటర్ గా గ్యారీ మంచి పేరు తెచ్చుకున్నాడు మరి అతను డైరెక్టర్ గా మారి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.







