మాస్ కా దాస్( Mas Ka Das ) విశ్వక్ సేన్ సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడు.ఈమధ్యనే తన డైరెక్షన్ లో దాస్ కా ధంకీ తో వచ్చిన ఈ యువ హీరో ఈ సినిమాకు డైరెక్టర్ గా కూడా చేసి సత్తా చాటాడు.
ఇక లేటెస్ట్ గా గేయ రచయిత కృష్ణ చైతన్య ( Krishna Chaitanya )డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్.ఈ సినిమా 90 ల కాలం నాటి కథతో పీరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది.
సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం విశ్వక్ సేన్( Vishwak Sen ) తన లుక్ కూడా మార్చేశాడు.యువ హీరోల్లో మాస్ ఆడియన్స్ కి రీచ్ అయిన వారిలో విశ్వక్ సేన్ ఒకరు.ఈ సినిమా లో అంజలి, నేహా శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది.పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడని చెప్పొచ్చు.
విశ్వక్ సేన్ ఈ సినిమా తర్వాత మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు.ఆ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తుందని తెలుస్తుంది.







