సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు వ్యాపార రంగంలో కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో నటుడు షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )తనయుడు ఆర్యన్ ఖాన్ ( Aryan Khan )గురించి పరిచయం అవసరం లేదు.అయితే ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది.
తాజాగా ఆర్యన్ క్లోతింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

ఆర్యన్ ఖాన్ డి యావోల్ ఎక్స్ ( Aryan Khan D Yavol X )పేరిట బ్రాండెడ్ బట్టలను విక్రయిస్తూ వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈయన విక్రయిస్తున్నటువంటి ఈ బ్రాండెడ్ ధరలు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.ఈ బ్రాండ్ కు సంబంధించిన ఒక్కో టీ షర్ట్ ధర దాదాపు 22 వేల నుంచి 24 వేల వరకు ఉన్నాయి.
ఒక లెదర్ జాకెట్( Leather jacket ) ధర ఏకంగా రెండు లక్షలు నిర్ణయించారు.ఇక హుడీ అయితే 45 వేలకు పైగా ధర ఉంది.ఇలా ఆర్యన్ ఖాన్ ప్రారంభించిన ఈ బ్రాండెడ్ దుస్తుల ధరలు ఈ స్థాయిలో ఉండడంతో నేటిజన్స్ ఆర్యన్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా ఇంత ధరలు ఉన్నప్పటికీ స్టాక్ వెంటనే అయిపోయిందని నెక్స్ట్ సేల్ కోసం ఎదురుచూస్తూ ఉండండి అంటూ ఆర్యన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.అయితే ఈ పోస్ట్ పై నేటిజన్స్ స్పందిస్తూ.దేవుడా నన్ను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టించావు అంటూ కొందరు కామెంట్లు చేయగా రెండు లక్షల లెదర్ జాకెట్ కొనాలి అంటే నా రెండు ఎకరాలు అమ్మేయాలి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే అన్న ఈ బ్రాండ్ దుస్తుల కొనాలి అంటే నా కిడ్నీ అమ్ముకోవాల్సిందే అంటూ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.







