అప్పుడప్పుడు సెలబ్రిటీలు తమ రహస్యాలు దాచిపెట్టె ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో అవి తమ ద్వారానే బయటపడుతూ ఉంటాయి.ఎంతో కాలం నుంచి రహస్యంగా దాచుకున్న విషయాలను.
ఏదో ఒక చిన్న పొరపాటు ద్వారా బయటపెడుతూ ఉంటారు.అయితే తాజాగా యాంకర్ రష్మీ( Anchor Rashmi ) కూడా అటువంటిదే ఎదురయింది.
ఇంతకాలం తను దాచిన విషయాన్ని నోరు జారి చెప్పేసింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
బుల్లితెర యాంకర్, గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి అందరికీ పరిచయమే.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక తన గ్లామర్ విషయంలో కూడా యువతను కన్నార్పకుండా చేస్తుంది.
బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
ఇక జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా చేసింది.ఇక ఈమె సుడిగాలి సుధీర్ తో ఈమె చాలా క్లోజ్ గా ఉండటంతో అందరి దృష్టిలో పడింది.అతడితో వేదికపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని గతంలో బాగా వార్తలు వినిపించాయి.అందుకే వీళ్లు షో లలో తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని అనుకున్నారు.
కాని తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని కేవలం షో వరకే ఇలా చేస్తామని గతంలో వీరిద్దరూ తెలిపారు.ఇక కొన్ని రోజుల నుండి శ్రీదేవి డ్రామా కంపెనీలో( Sridevi Drama Company ) కూడా యాంకర్ గా చేస్తుంది.అందులో కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటుంది.సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్టుతో బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన తర్వాత ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో రష్మీ నోరు జారింది.అందులో తమ జీవితంలో జరిగే విషయాలు సక్సెస్ అవుతాయా లేదా అని తెలుసుకోవడానికి ఓ లక్ టెస్ట్ పెట్టారు. పాప్ కార్న్ బాక్స్ లో రాయి పడితే అనుకున్నది జరుగుతుంది.
లేదా జరగదు అన్నట్లుగా క్రియేట్ చేశారు.
ఇక రష్మీ కూడా పాప్ కార్న్ బాక్సు( Popcorn box )లో రాయి వేస్తే లవ్ సక్సెస్ అవుతుందని.పడకపోతే ఫెయిల్ అవుతుందని అంత అనుకున్నారు.అయితే ఆమె వేసిన రాయి బాస్కెట్ లో పడింది.
దీంతో ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సక్సెస్ అన్నట్లు పెట్టింది.దీంతో ఆమె ఎవరితోనో లవ్ లో ఉంది అని అందరూ అనుకుంటున్నారు.
పాప్ కార్న్ బాక్స్ లో రాయపడగానే రష్మీ.నా పొలంలో మొలకలు వచ్చాయంటూ సందడి చేసింది.అయితే ఇంతకాలం తన ప్రేమ గురించి బయటకు చెప్పకుండా లో లోపల రహస్యంగా ఉంచిన రష్మీ ఆ గేమ్ లో అలా ప్రవర్తించడంతో ఆమె ఎవరితోనో ప్రేమలో ఉంది అని అందరూ అనుకుంటున్నారు.మరి ఇంతకు ఆ ప్రేమికుడు ఎవరో.
ఏం చేస్తుంటాడో అనేది తెలియాల్సి ఉంది.