సమంతకు మరో డిజాస్టర్ తప్పదా.. అలాంటి ప్రాజెక్ట్ లు ఆమెకు ఎందుకంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత( samantha ) శాకుంతలం సినిమాతో మరో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజుకు( Dil raju ) 25 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది.

 Samantha Mistakes About Script Selection Details Here Goes Viral , Samantha , Di-TeluguStop.com

సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు నెగిటివ్ టాక్ వచ్చింది.సిటాడెల్ ( Citadel )వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.

సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కీలక మార్పులు చేస్తే తప్ప ఈ వెబ్ సిరీస్ సక్సెస్ సాధించడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజ్ అండ్ డీకే( Raj and DK ) డైరెక్షన్ లోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.సమంతకు మరో డిజాస్టర్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మంచి ప్రాజెక్ట్ లను సమంత ఎంచుకోవాలని ప్రాజెక్ట్ ల ఎంపికలో పొరపాట్లు చేస్తే సమంతకు ఫ్లాపులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సమంత రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా శాకుంతలం( Sakunthalam ) ఫుల్ రన్ కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.శాకుంతలం సినిమాలో సామ్ పర్ఫామెన్స్ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి.సామ్ తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అవుతోంది.సమంత ముఖంలో కళ తగ్గిందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.సమంత భిన్నమైన పాత్రలకు ఓటేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.సమంత ఖుషి( kushi ) సినిమాపై భారీ ఆశలు పెట్టుకోగా ఆ ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందో లేదో చూడాలి.

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ఖుషి మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఆడియన్స్ అంచనాలను మించి ఈ సినిమా మెప్పించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube