చాలా మంది తమ ముఖం తెల్లగా మరియు కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కొందరు తరచూ వేలకు వేలు ఖర్చు పెట్టి బ్లీచ్, ఫేషియల్ వంటివి చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది నుంచి పది టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్,( apple cider vinegar ) రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), మూడు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం సిద్ధమవుతుంది.
ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరం ను అప్లై చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి వాటర్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ సీరం ను రెగ్యులర్ గా వాడటం వల్ల స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చడానికి ఈ సీరం చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ సీరం ను అప్లై చేసుకోవడం వల్ల ఉదయానికి ముఖం సూపర్ గ్లోయింగ్ గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.
సహజంగానే తెల్లగా కాంతివంతంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరంను తయారు చేసుకుని ఉపయోగించేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.