కొన్ని సార్లు సీరియల్స్ లో నటించే నటి నటులకు సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ దొరుకుతు ఉంటాయి.అలా వాళ్ళకి సినిమాల్లో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు.
ఇక నిన్నటికి నిన్న విరూపాక్ష సినిమాలో మేన్ విలన్ రోల్ లో నటించి మెప్పించాడు నటుడు రవి కృష్ణ.( Ravi Krishna ) ఈయన సీరియల్స్ నుంచి వచ్చిన నటుడు కావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఆయన ఆ క్యారెక్టర్ లో నిజంగా అద్బుతం గా నటించాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ సినిమాలో( NTR ) ఒక కీలక పాత్ర కోసం ఒక సీరియల్ నటిని తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడో మనందరికీ బాగా తెలుసు.
నార్మల్ హీరోగా తన కెరీయర్ని స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ గా .ఆ తర్వాత సూపర్ స్టార్ గా .ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా .ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు…ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆయన కెరియర్ లో 30వ సినిమా( NTR30 ) చేస్తున్నాడు .ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది .త్వరలోనే గోవాకి చెక్కేయబోతున్నారు ఎన్టీఆర్ థర్టీ టీం.ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా రెండో హీరోయిన్ గా సాయి పల్లవి సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి…ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ భార్యగా ఓ సీరియల్ యాక్టర్ ని సెలెక్ట్ చేసినట్లు న్యూస్ ట్రెండ్ అవుతుంది .అంతేకాదు ఆ సీరియల్ యాక్టర్ కి ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం .ఇప్పటికే రెండు సినిమాల్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఆమె దురదృష్టం కారణంగా అవి వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయని ఫైనల్లీ ముచ్చటగా మూడోసారి ఆ అవకాశాన్ని దక్కించుకొని బుల్లితెర నటులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది చైత్ర రాయ్.( Chaitra Rai ) వెండి తెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా తెలియదేమో కానీ బుల్లితెర వీక్షకులకు మాత్రం ఈ పేరు సుపరిచితమే.

కన్నడ సీరియల్స్ లో తెలుగు సీరియల్స్ లో బోలెడన్ని క్యారెక్టర్స్ వేసి అభిమానులను మెప్పించిన ఈమె ఎన్టీఆర్ 30 సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా కనిపించబోతుందట.అంతేకాదు భర్త నెగటివ్ క్యారెక్టర్ లో భార్యా పాజిటివ్ క్యారెక్టర్లు కనిపించబోతున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది.అంతేకాదు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో రెండు – మూడు సీన్స్ కూడా చిత్రీకరించారట .ఈ క్రమంలోనే బుల్లితెరపై చిన్న సీరియల్స్ నటించే చైత్ర రాయి ఎన్టీఆర్ 30 సినిమాలో ఆఫర్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .మరికొందరు ఆమెలో టాలెంట్ ఉందని ఆ కారణంగానే ఆమెకు ఇలాంటి అవకాశం అందింది అంటూ చెప్పుకొస్తున్నారు.ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…
.