ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ ( Vanitha Vijaykumar )గురించి పరిచయం అవసరం లేదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చినటువంటి ఈమె ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.అయితే తాజాగా ఈమె మాజీ మూడవ భర్త పీటర్ పాల్ ( Peter Paul ) గుండెపోటుతో గత శనివారం మరణించారు.
అయితే ఈయన మరణించడంతో వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తన మరణం పట్ల ఎమోషనల్ పోస్ట్ చేశారు.అయితే తాజాగా మరోసారి ఈమె ఈ విషయంపై స్పందిస్తూ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వనిత విజయ్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు పీటర్ నా భర్త కాదంటూ ఈమె కామెంట్ చేశారు.పీటర్ చనిపోగానే వనిత మాజీ భర్త పీటర్ మృతి అంటూ చాలా వెబ్సైట్స్ న్యూస్ రాసాయి.అయితే నాకు మీడియా పై ఉన్న గౌరవంతో తాను ఈ విషయం గురించి అందరికీ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అంటూ ఈమె పీటర్ గురించి తెలిపారు.

పీటర్ కు నాకు న్యాయ బద్దంగా పెళ్లి జరగలేదు.2020వ సంవత్సరంలో మేమిద్దరం కలిసి ఉన్నాం.అయితే ఏడాదికే మా రిలేషన్ ముగిసిందని చట్టపరంగా తనకు నేను భార్యను కాదు నాకు ఆయన భర్త కాదు నేను కేవలం మిస్ వనిత విజయ్ కుమార్ మాత్రమేనని.
తనకు ఎవరు భర్తలు లేరు అంటూ ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికైనా వనిత విజయ్ కుమార్ భర్త చనిపోయాడు అంటూ వార్తలు రాయడం ఆపేయాలని కోరారు.
ఇక ప్రస్తుతం తాను ఒంటరిగా ఉండడంతో ఏమాత్రం బాధపడలేదని,ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ ఈ సందర్భంగా వనిత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







