జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు కెరీర్ తొలినాళ్లలో ఊహించని స్థాయిలో మాస్ ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన మూవీ సింహాద్రి అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 20వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
ఈ సినిమాకు ఈ నెల 9వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమాతో రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) కానుకగా మే నెల 20వ తేదీన మరికొన్ని సినిమాలను కూడా థియేటర్లలో రీ రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు జరిగినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని భావించి ఆ సినిమాల రీ రిలీజ్ లను ఆపేశారని తెలుస్తోంది.అయితే ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింహాద్రి సినిమా( Simhadri Movie ) నన్ను ఏ రేంజ్ లో ఎత్తుకు తీసుకెళ్లిందో అదే విధంగా కిందికి తోసేసిందని తారక్ చెప్పుకొచ్చారు.సింహాద్రి సినిమా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక మూడు సంవత్సరాల పాటు కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తారక్ తెలిపారు.
రాఖీ సినిమాతో నా కెరీర్ పరంగా వెలుగు మొదలైందని ఆయన తెలిపారు.

మోహన్ బాబు( Mohan Babu ) గురించి చాలామంది చాలా విధాలుగా అనుకుంటారని అయన తెలిపారు.అయితే అబద్ధం మాట్లాడటం, చెప్పడం తెలియని వ్యక్తి మోహన్ బాబు అని ఆయన కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ తర్వాత సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.2024 చివరినాటికి ఈ మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.త్వరలో తారక్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని తెలుస్తోంది.







