సినిమా అంటే చాల పెద్ద జాబ్,,ఒక సినిమాను తీయడం లేదా దర్శకత్వం వహించడం అంటే మేధస్సు తో ఎన్నో సమకూరాల్సి వస్తుంది.దర్శకుడిగా ఫెయిల్ అయితే ఇంకో సినిమాతో ప్రూవ్ చేసుకోవచ్చు.
కానీ ఒక్కసారి నిర్మాత ఫెయిల్ అయితే రోడ్ మీద పడటం ఖాయం.అందుకే సరైన స్క్రిప్ట్ కి అంతే చక్కటి ప్లానింగ్ కూడా ఉండాలి.
ఆలా చేస్తేనే అనుకున్న సమయానికి సినిమా పూర్తి అవుతుంది.ఎంత డబ్బు పెట్టిన చక్కటి ప్లానింగ్ లేకపోతే లాభాలు రాకపోవచ్చు.
ఆలా అన్ని చేసిన కూడా నష్టాలు వస్తే దాన్ని తట్టుకొని నిలబడే శక్తి సామర్ధ్యాలు ఉండాలి.అయితే ఇన్ని సాధక బాధలతో కూడిన పనులను కేవలం మొగవారు మాత్రమే చేస్తారు అనుకుంటే పొరపాటు.
చాల మంది లేడీ నిర్మాతలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ లో చలామణి అవుతున్నారు.మరి అంత బాధ్యతాయుతమైన పని చేస్తూ తమ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న మహిళా నిర్మాతలు ఎవరో తెలుసుకుందాం.
ప్రియాంక దత్
అశ్విని దత్ రెండవ కుమార్తె మరియు దర్శకుడు నాగ్ అశ్విన్ భార్య ఐయాం ప్రియాంక తండ్రి దగ్గర నుంచి నిర్మాణ విభాగాన్ని తీసుకొని వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) ని చక్కగా సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.ఈమె నిర్మాత గా మారి తీసిన మహానటి సినిమాకు ఉత్తమ జాతీయ అవార్డు దక్కడం విశేషం.
నీలిమ
డైరెక్టర్ గుణశేఖర్ కి ఇండస్ట్రీ లో ఎంత పేరుందో అందరికి తెలిసిందే.అయన దర్శకత్వం చేస్తున్న సినిమాలకు అయన కుటుంబమే ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.ఇక ఈ సారి మాత్రం అయన కూతురు నీలిమను ( Neelima )నిర్మాతగా పరిచయం చేస్తూ శాకుంతలం సినిమా నిర్మించారు.
హన్షిత రెడ్డి
దిల్ రాజు చాల ఏళ్లుగా సినిమాలో ఇండస్ట్రీ లో ఉన్నారు.అయన సినిమా చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చాల మంది అంటుంటారు.అయితే దిల్ రాజు కుమార్తె కూడా తన తండ్రి బాటలోనే నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు .ఇటీవల వచ్చిన బలగం( Balagam ) సినిమాకు హన్షిత రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
కరుణ
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్( Natti Kumar ) కూతురు కరుణ కూడా సినిమా నిర్మాణంలో అడుగు పెట్టారు.అంతే కాదు దయ్యం తో సహజీవనం అనే సినిమాలో ఆమె నటించారు.
ప్రసీద
కృష్ణం రాజు ( Krishnam raju )పెద్ద కుమార్తె ప్రసీద సైతం తండ్రి నుంచి వారసత్వంగా సినిమా రంగాన్ని ఎంచుకుంది.ఇటీవలే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాకు ప్రసీద సహా నిర్మాతగా ఉన్నారు.