మే నెల మొదటివారంలో పలు క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.గత నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈ నెలలో రిలీజవుతున్న సినిమాలపై ప్రేక్షకులు అశలు పెట్టుకున్నారు.
ఈ వారం రిలీజవుతున్న సినిమాలలో రామబాణం సినిమాపై( Ramabanam ) ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి.
గోపీచంద్( Gopichand ), శ్రీవాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో( Ugram Movie ) నటించగా ఆ సినిమా కూడా ఈ వారమే థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ సినిమాలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.ఈ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

మే నెల 5వ తేదీన ఆరంగేట్రం, యాద్గిరి సన్స్ అనే సినిమాలు విడుదల కానుండగా ఈ సినిమాలపై పెద్దగా అంచనాలు లేవు.ఓటీటీలలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లో క్లిఫర్డ్ ది బిగ్ రెడ్ డాగ్ ఇంగ్లీష్ వెర్షన్, ది టేర్ ఇంగ్లీష్ వెర్షన్ మే 2వ తేదీన రిలీజ్ కానున్నాయి.క్వీన్ షార్లెట్ రి బ్రిడ్జిర్టన్ స్టోరీ, శాంక్చురీ మూవీ, ది లార్వా ఫ్యామిలీ మే 4వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి.

కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ మూవీ( Meter Movie ) మే 5వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.తూ ఝాటీ మ మక్కార్ హిందీ వెర్షన్ మే 5న స్ట్రీమింగ్ కానుండగా, 3, తమ్ముడు, రౌడీ ఫెలో, యోగి, అమృతం చందమామలో పాత సినిమాలు కూడా మే 5న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఈటీవీ విన్ లో మే 5న మ్యాచ్ ఫిక్సింగ్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫైర్ ప్లైస్ హిందీ సిరీస్, షెబాష్ ఫెలూద బెంగాలీ సిరీస్ మే 5న స్ట్రీమింగ్ కానున్నాయి.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కరోనా పేపర్స్ అనే మలయాళ మూవీ, సాస్ బహూ ఔర్ ఫ్లమింగో మే నెల 5వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి.







