Shankar : ఆ స్టార్ హీరోయిన్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన డైరెక్టర్ శంకర్ కూతురు.. వీడియో వైరల్?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్( Director Shankar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు శంకర్.

 Director Shankar Daughter Aditi Shankar Steps For Ileana Song-TeluguStop.com

ఇది ఇలా ఉంటే డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్సి 15 సినిమాకు దర్శకత్వం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.శంకర్ కూతురు అదితి శంకర్ కూడా మనందరికీ సుపరిచితమే.

మెడిసిన్ చదివిన అదితి గత ఏడాది స్టార్ హీరో కార్తీ సరసన విరుమన్( Viruman ) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం శివకార్తికేయన్ తో మావీరన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టార్ హీరోయిన్ ఇలియానా( Ileana ) పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.తన తండ్రి శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన స్నేహితుడు సినిమాలో ఇలియానా చిట్టి ఇలియానా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది.

అందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఆ వీడియోలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ని ధరించి అందాలను ఆరంబోస్తూ మత్తెక్కించే చూపులతో డాన్స్ చేస్తూ యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోని చూసిన నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే దర్శకుడు శంకర్ సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2, రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇటీవలే కమల్ మూవీ షెడ్యూల్ పూర్తి చేసి చరణ్ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు .దాదాపు 1200 మంది ఫైటర్స్ రామ్ చరణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube