అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు.జోష్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.
ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి హిట్ అందుకున్నాడు.ఇక అప్పటినుండి హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ నాగచైతన్య బిజీగా ఉన్నాడు.
బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న నాగచైతన్యకి ఇటీవల విడుదలైన థాంక్యూ( Thank You ) సినిమాతో పరాజయం ఎదురయింది.ఇక ప్రస్తుతం కస్టడీ( Custody ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది.కృతి శెట్టి, నాగచైతన్య జంటగా నటించిన బంగార్రాజు సినిమా మంచి హిట్ అందుకుంది.దీంతో కస్టడీ సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో అక్కినేని అభిమానులు ఉన్నారు.యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్( Police Officer ) పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ పనులను ప్రారంభించారు.

ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాల వెల్లడించాడు.ఈ క్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ.” ఇప్పటివరకు నా జీవితంలో బాధాకరమైన సంఘటనలు లేవు.నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ ఏదో ఒక పాఠం నేర్పాయి.కానీ మూడు సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయానని బాధపడ్డాను.” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.ఇక ప్రస్తుతం కస్టడీ సినిమా మీద నాగచైతన్య చాలా నమ్మకంగా ఉన్నాడు.థాంక్యూ సినిమా నిరాశపరిచినప్పటికీ.కస్టడీ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.







