Aishwarya Rai : నిలువెత్తు పోతపోసిన అందం..కానీ 30 ఏళ్లలో చేసింది 48 సినిమాలే !

ఐశ్వర్యరాయ్…( Asihwarya Rai )విశ్వంలోని అరుదైన ఒక అందగతే.మిస్ వరల్డ్.

 Aishwarya Rai Movies In Her 30 Years Of Career-TeluguStop.com

మోడల్.హీరోయిన్.ఎంత చెప్పిన ఆమె గురించి తక్కవే.1991 లో మోడలింగ్ ద్వారా రంగప్రవేశం చేసి ఆ తర్వాత కమర్షియల్ ప్రకటన ల్లో కూడా కనిపించింది.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Fanney Khan, Ponniyin Selvan-Movie

ఆ తర్వాత 1994 లో మిస్ వరల్డ్ గా సెలెక్ట్ అయ్యి ఆమె ఇండియాలో ఇంత అందం కూడా ఉంటుందా అని నిరూపించింది.మిస్ వరల్డ్( Miss World ) కిరీటం తో ఇండియాకు వచ్చిన ఐశ్వర్య కు ఒక మూడేళ్ళ పాటు సినిమాలు ఏమి పెద్దగా రాలేదు.తమిళ్ లో మొదటి చిత్రం ఇరువర్.ఈ సినిమా ఇద్దరు పేరుతో తెలుగులో కూడా విడుదల అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత ఔర్ ప్యార్ హో గయా అనే హిందీ సినిమాలో నటించింది.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Fanney Khan, Ponniyin Selvan-Movie

ఇక అప్పటి నుంచి పొన్నియన్ సెల్వన్( Ponniyin Selvan ) రెండు భాగాలతో కలిపి ఆమె కేవలం 48 సినిమాల్లో మాత్రమే నటించింది.ఆమెతో పాటు నటించిన చాల మంది హీరోయిన్స్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిన చాల సినిమాల్లోనే కనిపించారు.కానీ ఐశ్వర్య మాత్రం ఎన్ని సినిమాలు చేశామా అని కాదు ఎంత మంచి పాత్రలను ఎంచుకున్నామా అనే విధానాన్ని అవలంబించి ఎక్కువగా సినిమాలో తీయలేదు అని అనుకోవచ్చు.

ఆమె పెళ్లయిన తర్వాత కూడా మంచి సినిమాల్లో నటించే అవకాశం లభించింది.ఇక ఇప్పుడు ఒక కుమార్తె ఉన్నప్పటికి ఏ పాత్రా పడితే ఆ పాత్రా కాకుండా తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందా లేదా అని మాత్రమే చూసుకుని చేస్తుంది.

ఇక ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Fanney Khan, Ponniyin Selvan-Movie

ఐదేళ్ల క్రితం ఫన్నే ఖాన్ చిత్రం( Fanney Khan )లో నటించగా ఆ తర్వాత పొన్నియన్ లో మాత్రమే నటించడానికి అంగీకరించింది.కానీ ఆమె దగ్గరికి చాల కథలు వస్తున్న కూడా అంత త్వరగా సినిమా అంగీకరించడం లేదు అని తెలుస్తుంది.ఒక వేల ఒప్పుకున్నా కూడా ఆమె రెమ్యునరేషన్ మరియు స్టాఫ్ ఖర్చులు మైంటైన్ చేయడానికి తడిసి మోపెడు అవుతుంది.

ఆలా ఆమె చెప్పినట్టు చేయాలంటే కేవలం పెద్ద సినిమా నిర్మాతలు మాత్రమే ఒప్పుకోగలరు.అందువల్లే ఐశ్వర్య కెరీర్ చాల నిదానంగా వెళ్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube