ఇప్పుడు మన టాలీవుడ్ లో ఎవ్వరి నోట విన్న కూడా విరూపాక్ష ( Virupaksha ) పేరునే వినిపిస్తుంది.అంతగా ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది.
కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాతో సాయి తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అనే చెప్పాలి.

టైర్ 2 హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తో వచ్చి ఇన్నేళ్ల గ్యాప్ ను ఒక్క సినిమాతోనే ఫుల్ ఫిల్ అయ్యేలా చేసుకున్నాడు.సాయి తేజ్ హీరోగా సంయుక్త మీనన్( Samyukta Menon ) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా విరూపాక్ష.మొదటి రోజు కంటే ఆ తర్వాత వీకెండ్ లో పుంజుకుని స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే రెండవ వారంలోకి అడుగు పెట్టిన కూడా ఇంకా హౌస్ ఫుల్స్ తో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది.ఎప్పుడో బ్రేక్ ఈవెన్ కూడా అయి లాభాల బాట పట్టిన విరూపాక్ష తాజాగా 70 కోట్ల మార్క్ చేరుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.దీంతో విరూపాక్ష చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టిస్తుంది అనే చెప్పాలి.ఇక వీకెండ్ లో మరింత స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమా మరింత రన్ చేరుకునేలా ఉంది.
చిన్న సినిమా అయిన కూడా కంటెంట్ బాగుంటే స్టార్ హీరోల సినిమా రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం పెద్ద విషయం కాదు.ఇదే విషయాన్నీ విరూపాక్ష మేకర్స్ కూడా చెబుతున్నారు.
ది పవర్ ఆఫ్ స్ట్రాంగ్ కంటెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా 70 కోట్లు కలెక్ట్ చేసింది అని ఇంకా రెండవ వారం కూడా విరూపాక్ష హౌస్ ఫుల్ అవుతుంది అని చెబుతున్నారు.







