పోసాని కృష్ణమురళి ఎవరో నాకు తెలియదు.. శివాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ( Actor Shivaji )ఇంటర్వ్యూలలో ఏ విషయం చెప్పినా ఆ విషయాలు సంచలనం అవుతుంటాయి.శివాజీ చేసే విమర్శలు ఒకింత ఘాటుగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

 Actor Shivaji Shocking Comments About Posani Krishna Murali Details Here Goes Vi-TeluguStop.com

విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదని శివాజీ కామెంట్లు చేశారు.ఏపీలో ప్రజలు మానసికంగా చనిపోయారని ఆయన కామెంట్లు చేశారు.

ప్రతి ఆంధ్రుడి ఇంటికి సమస్యలు వస్తాయని శివాజీ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

రాజకీయ నాయకులకు ఈ బానిస మనస్తత్వాలు ఎందుకు? అని శివాజీ ప్రశ్నించారు.ప్రతిదానికి బానిసత్వం ఏంటని శివాజీ అభిప్రాయపడ్డారు.కులం అనేది సమాజాన్ని పద్ధతిగా పెట్టడం కోసం అని ఆయన తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో కుల వ్యవస్థ( Caste System ) లేదని శివాజీ చెప్పుకొచ్చారు.ఏపీ అసెంబ్లీలో మాట్లాడే స్వేచ్ఛ లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలోని ప్రతి రాష్ట్రంలో స్పీకర్లు రాజకీయ నాయకులలా వ్యవహరిస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చారు.పోసాని కృష్ణమురళి( Posani Krishna Murali ) లాంటి పెద్దవాళ్ల గురించి నేను మాట్లాడనని ఆయన కామెంట్లు చేశారు.నేనెవరో తెలియదని ఆయన చెప్పాడని నాకు కూడా ఆయన ఎవరో తెలియదని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.నాకైతే రాజశేఖర్ రెడ్డి గారు అవార్డ్ ఇచ్చారని శివాజీ కామెంట్లు చేశారు.

రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ) చేతుల మీదుగా నాకైతే నంది అవార్ద్ వచ్చిందని శివాజీ చెప్పుకొచ్చారు.ప్రజలు అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నానని మంచి ఏదో చెడు ఏదో ప్రజలు తెలుసుకోవాలని ఆయన కామెంట్లు చేశారు.

శివాజీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని దర్శకనిర్మాతలు తనకు మంచి పాత్రలు ఆఫర్ చేయాలని శివాజీ భావిస్తున్నారు.

ఈ ఏడాది అయినా నటుడిగా శివాజీకి కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube