అక్కినేని అఖిల్( Akhil Akkineni ) హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా మీద చాలా మంది చాలా కామెంట్లు చేస్తున్నారు అందులో భాగంగానే అఖిల్ ఇక అఖిల్ కి హిట్ ఇచ్చే డైరెక్టర్ లేదు అంటూ రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి …ఇక ఇంతకు ముందు ఈ సినిమా లాగానే వచ్చి భారీ ప్లాప్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) హీరోగా వచ్చిన లైగర్ సినిమా అనే చెప్పాలి…ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కి ముందు చాలా హైప్ క్రియేట్ చేశాయి కానీ రిలీజ్ తర్వాత ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి…

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల డిజాస్టర్ వెనక ఒక కామన్ పదం కనిపిస్తోంది.అదే సాలా.ఇది ఒక హిందీ పదం.దీనికి తెలుగులో బావమరిది అని అర్థం వస్తుంది.అయితే అదేదో తిట్టు మాదిరిగా ఈ పదాన్ని తయారు చేసేసారు.నార్త్ బెల్ట్ లో సాలా సాలా అంటూ మాట్లాడటం కామన్.ఆ హిందీ డైలాగులు పూరి జగన్నాథ్( Puri Jagannadh ) కు బాగా ఇష్టం.అందుకే లైగర్ సినిమా తీసి సాలా క్రాస్ బ్రీడ్ అనే పదం మన మీదకు వదిలాడు.

సినిమా భయంకరమైన ప్లాప్ అయింది.ఇప్పుడు సురేందర్ రెడ్డి( Surendar Reddy ) అఖిల్‌తో ఏజెంట్ సినిమా తీశాడు.అక్కడితో ఆగకుండా దానికి వైల్డ్ సాలా అన్న పదం యాడ్ చేశారు.సాలా అంటేనే పవర్ ఫుల్ తిట్టు అని ఫీల్ అవుతుంటే… వైల్డ్ సాలా అన్నది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని ఆలోచించినట్టు ఉన్నారు.
సేమ్ లైగర్( Liger ) సెంటిమెంట్ ఏజెంట్‌కు కూడా రిపీట్ అయ్యి ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.
దీనిని బట్టి చూస్తే సాలా అన్నది తెలుగు సినిమాలకు పెద్దగా అచ్చి రాలేదని చెప్పాలి.
టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ వరల్డ్.ఇక ఫ్యూచర్ లో ఈ సాలా పదం వాడడానికి మనోళ్లకు బాగా భయం పట్టుకునేంత గొప్ప రిజల్ట్ ఇచ్చాయి…ఇక ఏజెంట్( Agent ), లైగర్ రెండు సినిమాలు తీసింది కూడా తెలుగు లో టాప్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ్,సురేందర్ రెడ్డి లు కావడం నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ కి భాదను కలిగించే విషయం అనే చెప్పాలి…
.







