ఫ్లిప్ కార్ట్( Flipkart ) లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ భారీ ఆఫర్లు మే 5 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
ఈ భారీ ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ తన ప్లాట్ ఫారం లో బిగ్ సేల్ ప్రారంభించడానికి సిద్ధమైంది.ఈ సేల్ లో ఐఫోన్ 13, పిక్సెల్ 6a, శాంసంగ్ గెలాక్సీ ( Samsung Galaxy )F14 5G, రియల్ మీ C55 లాంటి ఫోన్లో పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉండనున్నాయి.కొనుగోలుదారులు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సమయంలో రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ ను రూ.7,999 కే పొందవచ్చు.పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ రూ.25,999 కే పొందవచ్చు.రియల్ మీ GT నియో 3T ధర రూ.19,999 కు అందుబాటులో ఉంటుంది.పోకో X5 రూ.20,999 కే పొందవచ్చు.రియల్ మీ 10ప్రొ+5G రూ.22,999 లో అందుబాటులో ఉంటుంది.

అంతేకాకుండా ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 13 ధరపై ఆఫర్ ని ప్రకటించలేదు.కానీ 5G ఐఫోన్ రూ.61,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనుంది.ఇంకా ఈ సెల్ లో మోటోరోలా మోటో( Motorola Moto ) e13 రూ.7499 లో పొందవచ్చు.పిక్సెల్ 7 రూ.44,999 కు కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్ కార్ట్ లో మరికొన్ని ఆఫర్లు కూడా ఈ సేల్ లో అందుబాటులోకి రానున్నాయి.
దానికి సంబంధించిన వివరాలు మే ఒకటవ తేదీ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.ఫ్లిప్ కార్ట్ మాత్రం మునప్పటి ఆఫర్ల కంటే ఈ సేల్ లో అధిక ఆఫర్లు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
ఫ్లిప్కార్ట్ యొక్క ప్లస్ మెంబర్షిప్ ఉన్న కొనుగోలుదారులు ఒకరోజు ముందుగానే సేల్ను యాక్సెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది.మొత్తానికి ఫ్లిప్కార్ట్ లో మే ఐదవ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.







