నిన్న విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.దీంతో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఉదయం నుండి ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నీ చంపిన వారంతా ఒకే వేదిక పైకి వచ్చి ఎన్టీఆర్( NTR ) ని పొగుడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఎన్టీఆర్ నీ వెన్నుపోటు పొడిచి టీడీపీనీ లాక్కున్నారని ఆరోపించారు.

చంద్రబాబు( Chandrababu ) పాలనలో మంచి జరిగిందని ఒక్కరైనా చెప్పగలరా.?.తడిగుడ్డలతో గొంతులు కోసే రక్త చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.ఆ నాడు ఎన్టీఆర్ నీ పదవి నుంచి తప్పించడంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని మంత్రి జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ యుగానికి వీరుడు ధీరుడు సీఎం వైఎస్ జగన్.లోకేష్ పాదయాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నారు.తెలుగు సినిమా తారల ఎవరైనా చంద్రబాబును పొగుడుతారా అంటూ జోగి రమేష్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.14 ఏళ్ళు సీఎం గా ఉండి ఎన్టీఆర్ కి భారతరత్న ఇప్పించలేదు.27 ఏళ్ల తర్వాత భారతరత్న ఇప్పిస్తావా చంద్రబాబు అంటూ.ప్రశ్నించడం జరిగింది.







