ఇటీవలే కాలంలో కష్టపడకుండా సంపాదించుకోవాలి అనే వారిని టార్గెట్ చేస్తూ లక్షలకు లక్షలు కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు( Cyber threats ).ఒకరకంగా సైబర్ మోసాలకు కారణం మనిషి అత్యాశ అని చెప్పవచ్చు.
ఈమధ్య ఆన్లైన్ లో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఎన్నో ప్రకటనలు చూస్తూనే ఉన్నాం.అందులో మంచి ప్రకటనలు ఏవో.మోసపూరిత ప్రకటనలు ఏవో తెలుసుకోవడం చాలా కష్టం.ముఖ్యంగా యువకులు వాట్సాప్, ఫేస్బుక్, టెక్స్ట్ మెసేజ్( WhatsApp, Facebook, Text Message ) లలో వచ్చే మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై నిండా మునిగిపోతున్నారు.
మరొకపక్క పార్ట్ టైం జాబ్ ఎంచక్కా ఇంట్లో కూర్చుని వేలకు వేలు సంపాదించుకోవచ్చు అననే మెసేజ్లు చూసి అత్యాశకు పోతే మన పని అయిపోయినట్టే.ఓ వ్యక్తి ఇలా అత్యాశకు పోయే ఏకంగా రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.కామారెడ్డి జిల్లాలోని జయశంకర్ కాలనీలో సందీప్( Sandeep ) నివాసం ఉంటున్నాడు.సందీప్ ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టడం కోసం లోన్ యాప్స్ ద్వారా రూ.12 లక్షలు రుణం తీసుకొని మరి పెట్టుబడి పెట్టాడు.సందీప్ అత్యాశతో వచ్చే లాభాలతో రుణం తీరుతుంది.
తనకు కూడా బాగానే డబ్బులు వస్తాయని సంబరపడ్డాడు.కానీ పెట్టిన పెట్టుబడిలో చిల్లి గవ్వ కూడా చేతికి రాకుండా అన్ని మాయమైపోయాయి.
మరొకవైపు తీసుకున్న అప్పు తీర్చాలంటూ లోన్ యాప్స్ వేధింపులు ప్రారంభమయ్యాయి.తాను మోసపోయిన విషయం గ్రహించిన సందీప్ చివరకు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
సందీప్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయని.దయచేసి ఆన్లైన్ మోసాలకు బలి కావద్దని సూచించారు.







