వాట్సాప్ ( Whatsapp ) ఎప్పటికప్పుడు తన యూజర్లకు అవసరమైన అప్డేట్లు ఇస్తూ వారిని మరింత ఆకర్షిస్తోంది.ఈ క్రమంలోనే ఈ యాప్ మల్టీ డివైజ్ సపోర్ట్‌ను( Multi Device Support ) తీసుకువచ్చిన సంగతి విదితమే.
అయితే దీని ద్వారా ఒకే అకౌంట్‌ను ప్రైమరీ ఫోన్‌లో కాకుండా 4 ఇతర డివైజ్‌ల్లోనూ లాగిన్ చేయడం కుదిరేది.ప్రైమరీ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఇతర డివైజెస్‌లో అకౌంట్‌ను యాక్సెస్ చేయడం సాధ్యమైంది.
అయితే ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఒకటికంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లలో ఒకే కాలంలో యాక్సెస్ చేయడం మాత్రం కుదిరేది కాదు.
అయితే ఈ మార్పుకోసం యూజర్లు ఎంతో కాలంగా వెయిట్ చేయగా వారి కోరిక మేరకు వాట్సాప్ తాజాగా ఆ సదుపాయాన్ని కూడా కలిగించింది.ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ఒకే అకౌంట్‌ను ఇపుడు 4 స్మార్ట్‌ఫోన్లలో ఏకకాలంలో వాడుకోవచ్చన్నమాట.అంటే మీ ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో 4 స్మార్ట్‌ఫోన్లలో సేమ్ అకౌంట్‌ను ఇపుడు ఉపయోగించవచ్చు.
ఆ 4 పరికరాలు స్మార్ట్‌ఫోన్లు అయినా కావచ్చు, లేదంటే పీసీలు, స్మార్ట్‌ఫోన్‌లు అయినా ఉండవచ్చు.
అవును, ఇపుడు మొబైల్స్ కాకుండా వెబ్ బ్రౌజర్లు, డెస్క్‌టాప్ యాప్‌లలో కూడా ఒకే అకౌంట్‌లో లాగిన్ అయ్యి చాట్ చేసుకోవచ్చన్నమాట.దానికోసం… సెకండరీ ఫోన్‌లో ‘లింక్ ఏ డివైజ్’ ఫీచర్( Link A Device ) ద్వారా వాట్సాప్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై ప్రైమరీ ఫోన్‌లో అందుకున్న OTP ద్వారా 2 ఫోన్లలో ఒకేసారి వాట్సాప్ వినియోగించవచ్చు.అదేవిధంగా ప్రైమరీ ఫోన్‌లో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా కంపానియన్ డివైజ్‌ను ఇక్కడ కుదించుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను పొందడానికి , iOS డివైజ్‌ల్లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.