బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది.ఏప్రిల్ చివరి వారంలో ఈ కేసు విచారణకు రావాల్సి ఉన్నా లిస్టు కాలేదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.
ఈడీ కేసులో మహిళల విచారణపై గతంలో కవిత సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పిటిషన్ ను త్వరగా విచారించాలని న్యాయవాది కపిల్ సిబల్ స్పెషల్ మెన్షన్ చేశారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కార్యాలయంలో విచారించిన సంగతి తెలిసిందే.







