మహేష్ త్రివిక్రమ్ మధ్య గొడవలు.... క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలే ఉన్నాయి.

 Clashes Between Mahesh Trivikram Producer Naga Vamsi Gave Clarity Details, Mahes-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా వంటి సినిమాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని త్రివిక్రమ్ విషయంలో మహేష్ బాబు చాలా అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా మొదటినుంచి మహేష్ త్రివిక్రమ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ముందుగా ఈ సినిమాకు పూజా హెగ్డే (Pooja Hedge)హీరోయిన్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వద్దని మహేష్ చెప్పినప్పటికి త్రివిక్రమ్ తనని కన్విన్స్ చేశారని తెలుస్తుంది.

అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా మార్పులు చేయమని చెప్పిన త్రివిక్రమ్ లైట్ తీసుకున్నారని సమాచారం.

Telugu Pooja Hegde, Mahesh Babu, Maheshbabu, Music Thaman, Nagavamshi, Sreeleela

ఇక మహేష్ శ్రీలీల(Sreeleela) మధ్య తీసినటువంటి సన్నివేశాలు సరిగా రాకపోవడంతో వాటిని తొలగించి మరోసారి షూట్ చేద్దామని చెప్పగా మహేష్ బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని,ఇలా వీరి మధ్య ఉన్నటువంటి ఈ గొడవలు మనస్పర్ధలతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.అయితే తాగారా ఈ వార్తలపై సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ స్పందించి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Telugu Pooja Hegde, Mahesh Babu, Maheshbabu, Music Thaman, Nagavamshi, Sreeleela

ఈ క్రమంలోనే నాగ వంశీ(Nagavamshi) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పక్షులు ఆహారం కోసం వెతికే సమయంలో పెద్ద ఎత్తున శబ్దం చేస్తాయి అలాగే ఒక వ్యక్తి అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న సమయంలో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారని తెలిపారు.ఇలాంటి వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే వాటి గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.సూపర్ స్టార్ అభిమానులు SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుందని నాగ వంశీ వెల్లడించారు.

మీరు వినాలనుకున్నది వినండి కానీ ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా మహేష్ త్రివిక్రమ్ గురించి వస్తున్నటువంటి వార్తల పై స్పందిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube