కమ్యూనికేషన్ రంగంలో ఇతర దేశాలతో పోల్చితే చైనా ( China ) ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది.ఎంతలా అంటే భారత్ వంటి దేశాలు ఇప్పుడిప్పుడే 5G టెక్నాలజీని అందుకునే ప్రయత్నం చేస్తుండగా చైనా మాత్రం 6G టెక్నాలజీలో( 6G Technology ) అడుగుపెట్టేసింది.
అవును, టెక్ దిగ్గజం హువెయి( Huawei ) 6G టెక్నాలజీకి సంబంధించి సొంత రోల్ అవుట్ కోసం రంగం సిద్ధం చేసింది.ఈ నేపథ్యంలోనే చైనా పరిశోధకుల బృందం ఒకటి మొట్టమొదటి రియల్ టైమ్ వైర్లెస్ ట్రాన్స్ మిషన్తో అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్ ని సాధించించినట్లు చైనీస్ మీడియా తాజాగా ప్రకటించింది.

చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సెకండ్ ఇన్స్టిట్యూట్ నుంచి పరిశోధన బృందం టెరాహెర్ట్జ్ ఆర్బిటల్ యాంగ్యులర్ మొమెంటం కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఘనత సాధించినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.దీనికోసం 110 GHz ఫ్రీక్వెన్సీలో 4 వేర్వేరు బీమ్ నమూనాలను రూపొందించడానికి ప్రత్యేక యాంటెన్నాను వాడినట్లు సమాచారం.ఆ నమూనాలతో, బ్యాండ్విడ్త్ వినియోగ సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు కూడా చెప్పింది.ఇకపోతే, హై ఫ్రీక్వెన్సీ కారణంగా, టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్ మరింత సమాచారాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.

ఇకపోతే 6G కమ్యూనికేషన్, హై-స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఎక్కువగా సైనికుల కమ్యూనికేషన్లలో వాడబడుతుంది.6G మొబైల్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ అనేది 5Gతో పోల్చితే 10 నుంచి 20 రెట్లు వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.సమీప భవిష్యత్తులో, 6Gని ఉపయోగించి పీక్ కమ్యూనికేషన్ వేగం సెకనుకు ఒక టెరాబిట్ కి చేరుకుంటుంది అని అంటున్నారు.6G నెట్ వర్క్ విషయంలో చైనాతో పోల్చితే అమెరికా వెనకబడినట్టే చెప్పుకోవచ్చు.







