షర్మిల హడావుడిని జనాలు పట్టించుకుంటున్నారా? లేదా?

తెలంగాణ రాష్ట్రం లో అధికార బీఆర్ఎస్ కి( BRS ) పోటీగా కాంగ్రెస్ మరియు బిజెపి హోరా హోరీగా తలపడుతున్నాయి.ఈసారి అధికారం మాది అంటే మాది అంటూ ఈ మూడు పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాటం సాగిస్తున్నాయి.

 Ys Sharmila Done Political Hungama In Telangana Recent Days Details, Ys Sharmila-TeluguStop.com

ఈ సమయం లో వైయస్సార్ టీపీ( YSRTP ) మధ్యలోకి తీసుకొచ్చి వైఎస్‌ షర్మిల( YS Sharmila ) సందడి చేస్తున్నారు.గత కొన్నాళ్లుగా ఆమె పదే పదే జైలుకు వెళ్లడం వంటివి జరుగుతున్నాయి.

పాద యాత్రలు చేస్తుంటే మీడియాలో ఫోకస్ ఉండటం లేదని భావించిందో ఏమో కానీ ఇలా పదే పదే ఆందోళనలు చేస్తూ అరెస్టయితే జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకుంటుంది.షర్మిల చేస్తున్న హడావిడి తో గతం తో పోలిస్తే ఆమె కు ఈ మధ్య కాలంలో మైలేజ్ పెరిగిందని వార్తలు వస్తున్నాయి.

Telugu Cmjagan, Congress, Ts, Ys Jagan, Ys Sharmila, Yssharmila, Ysrtp-Politics

కానీ కింది స్థాయి జనాలు మాత్రం షర్మిలను నమ్మే పరిస్థితి లేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.షర్మిల ఎంతగా కష్టపడ్డా కూడా ప్రస్తుతానికి ఆమె ఒకటి రెండు స్థానాల్లో గెలవడమే గొప్ప విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్యులు చెబుతున్న దాని ప్రకారం షర్మిల పట్ల సానుభూతి ఉంటుందేమో కానీ ఆమెకు ఓట్లు వేయడానికి ఆసక్తి ఏ ఒక్కరికి లేదని అంటున్నారు.షర్మిల చేస్తున్న హడావుడి చూస్తూ ఉంటే ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా కచ్చితంగా ఆమె పార్టీ ప్రభావం చూపిస్తుందేమో అని చర్చ జరుగుతుంది.

Telugu Cmjagan, Congress, Ts, Ys Jagan, Ys Sharmila, Yssharmila, Ysrtp-Politics

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరం లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఒక్కరు అయిన గెలిచి అసెంబ్లీ లో అడుగు పెడితే అది గొప్ప విజయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సోషల్ మీడియా లో షర్మిల కి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరిగా షర్మిలకు పేరు ఉంది.అయితే ఏపీ లో జగన్మోహన్ రెడ్డి అధికారం నుండి తప్పుకుంటే షర్మిల కు తెలంగాణ లో పట్టు దక్కే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube