తెలంగాణలో వచ్చే ఎన్నికలకు అధికార బిఆర్‌ఎస్ పార్టీ( BRS ) ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టింది.ఈసారి ఎన్నికలతో గెలిచి ముచ్చటగా మూడవసారి కూడా అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తున్నారు గులాబీ బాస్ కేసిఆర్.( KCR ) ఇప్పటికే నేతలకు, ఎమ్మెల్యేలకు నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన కేసిఆర్.
ఇక జిల్లా ఇంచార్జ్ లు, కార్యదర్శులను ప్రజల్లో యాక్టివ్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.ఈ నెల 27 న రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజిక వర్గాలలో ప్లీనరీ సమావేశాలు( Plenary Meetings ) జరగనున్నాయి.
ఈ సమావేశాలన్నీ కూడా పార్టీ ఎమ్మేల్యేలు, జిల్లా ఇంచార్జ్ ల ఆద్వర్యంలో జరగనున్నాయి.ఒక్కో సమావేశం కోసం 3,500 మంది దాకా ప్రజాపతినిధులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేసిఆర్ చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ది.ఇలా ప్రతిదీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
కాగా గతంతో పోల్చితే ప్రతిపక్ష పార్టీలు కూడా బాగానే బలం పెంచుకున్నాయి.
దాంతో ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే అధికారం చేజారిపోయిన ఆశ్చర్యం లేదనే భావనతోనే ఎమ్మెల్యేలను, ఇంచార్జ్ లను, ప్రజాప్రతినిధులను.ఇలా అందరినీ ప్రజల్లో ఉంచేందుకే కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతమేర ఉంది.
సానుకూలత ఏ స్థాయిలో ఉంది అనే దానిపై కూడా క్షేత్ర స్థాయిలో రిపోర్ట్ ఇప్పటికే కేసిఆర్ చేతికి అందిందట.అయితే ఆయా నియోజిక వర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉందట.
అందుకే వ్యతిరేకత ఉన్న నియోజిక వర్గాలలో ఎక్కువ ఫోకస్ చేస్తూ లోపాలను సరిదిద్దుకోవాలని నేతలకు.కేసిఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారట.ఇక సీట్ల కేటాయింపులో కూడా ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేస్తినట్లు తెలుస్తోంది.కచ్చితంగా గెలుపు గుర్రాలకే సీట్ల కేటాయింపు ఉంటుందని, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేసేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు కేసిఆర్.
మొత్తానికి రాష్ట్రంలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడిని పెంచుతున్నారు గులాబీ బాస్ మరి వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.