సొరకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలుసుకుంటే తినకుండా ఉండలేరు!

సొరకాయ.( bottle gourd ).దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎలాంటి రసాయనాలు లేకుండా పండించే కూరగాయల్లో సొరకాయ ఒకటి.

 Amazing Health Benefits Of Bottle Gourd , Bottle Gourd, Bottle Gourd Health, Ben-TeluguStop.com

సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.అలాగే ఎన్నో విలువైన పోషకాలు సైతం నిండి ఉంటాయి.

కానీ, చాలా మంది సొర‌కాయ‌ను దూరం పెడుతుంటారు.నిజానికి సొరకాయ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే తినకుండా ఉండలేరు.

ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మంది అధిక బరువు సమస్య( Weight problem )తో బాధపడుతుంటారు.బరువు తగ్గడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.అలాంటి వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.రోజుకు ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్( bottle gourd juice ) ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే కొద్ది రోజుల్లో సన్నబడతారు.

అలాగే సొరకాయలో ఫైబర్ కంటెంట్‌ పుష్కలంగా నిండి ఉంటుంది.అందువల్ల వారానికి కనీసం రెండు మూడు సార్లు సొరకాయ ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం( Gas, acidity, constipation ) వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చాలా మంది చిన్న వయసులోనే జుట్టు తెల్ల‌బ‌డుతుందని వర్రీ అయిపోతుంటారు.అలాంటి వారు రోజుకు ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ ను తాగితే తెల్ల జుట్టుకు బై బై చెప్పవచ్చు.

సొరకాయ లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఇక ప్రస్తుత వేసవి కాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారి సొరకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.శరీరంలో పేరుకు పోయిన వ్యర్థాలు మలినాలు తొలిగిపోతాయి.మరియు నిద్రలేమి సమస్యను నివారించడానికి సైతం సొరకాయ గ్రేట్ గా సహాయపడుతుంది.కాబట్టి సొరకాయను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube